Tuesday 12 June 2018

Learn Tamil in Telugu


అందరూ మీపేరు చెప్పండి
ఎల్లారు ఒంగ పేరు సొల్లుంగో

అందరూ తప్పనిసరిగా మొక్కలను పెంచాలి
ఎల్లారూ కండిపా చెడిగళ వలకనుం


నాలుగు- నాలు
సంవత్సరాలుగా - వర్షమా
పోలీసులు వెతికి - పోలీస్ తేడి
రెండు రోజుల - రెండు నాల్
ముందే - మున్నాడిదా (ముందు- మున్నాడి)
అరెస్ట్ చేసారు- అరెస్ట్ పన్నా
ఇప్పుడు - ఇప్పో
జైల్ నుండి - జైల్ లేందు
తప్పించుకున్నాడే - తప్పిచ్చిటానే

ఇంత సెక్యూరిటీ - ఇవొళో సెక్యూరిటీ
ఉన్నా- ఇరుందూ

తప్పిచ్చుకు పోయాడు సర్-  తప్పిచ్చిపోయిటా సర్
విషయం - విషయం (సంగతి)
వెల్లీల - బయట
తెరింజా - తెలిస్తే
పెరియ - పెద్ద (చాలా)
కెట్ట పేరాయిడుం  (కెట్ట పేరు ఆయిడుం)- చెడ్డ పేరు అవుతుంది (చెడ్డ పేరు వస్తుంది)
ఇప్పొ - ఇప్పుడు
అవన - వాన్ని
ఎప్పిడీ పుడికిరదీ - ఎలా పట్టుకునేది
సర్, నీంగ-సర్ మీరు
తప్పా ననికెలేన్న (తప్పా ననికెలె అన్న) - తప్పుగా అనుకోకపోతే
ఒరు ఐడియా- ఒక ఐడియా
ఇదే జైల్ల - ఇదే జైలులో
ఒరు ఖైదీ ఇరుకా- ఒక ఖైదీ ఉన్నాడు
ఇదివరకు పదినెట్టు దడవ- పద్దెనిమిది సార్లు
జైల్లేందు తప్పిచ్చిర్కా- జైల్ నుండి తప్పించుకున్నాడు
అవన్ట (అవన్ ట) కేటా-వాన్ని అడిగితే
తప్పిచ్చుపోనవనోడ-తప్పించుకుపోయినవాడి
సైకాలజీ తెరియుం- సైకాలజీ తెలుస్తుంది



మీరే ఎవరైనా - నీంగలే యారావదు
రోజూ- దినాం
రెండు పదాలను రెండు వార్తెగల్
ఇవ్వండి - కుడుంగో

నేను - నాన్
దానికి - అదుక్కు
తమిళ్ లో - తమిళ్ ల
చెప్తాను- సొల్డ్రేన్ 
ఏమంటారు? - ఎన్న సొల్డ్రేల్?

నేను-నాన్
ఈరోజు-ఇన్నికి
సినిమాకు-సినిమాకు
పోతున్నాను-పోయిండ్రికేన్

ప్రస్తుత కాలంలో- ఇందకాలంల
ధరలు-వెలె
పెరుగుతున్నాయి- జాస్తి ఆయిండ్రిర్కు
ఏమీ చేయలేమా-ఒన్నుం పన్నముడియాదా

పిల్లలకు- కొళందిగల్కు
పరీక్షలు-పరీక్షె
అవుతున్నాయి- నండందుండ్రుకు

అది- అది
పెద్దవారికి-పెరియవంగళ్కు కూడా
పరీక్ష లాగా- పరీక్ష మాదిరి దాన్

నన్ను- ఎన్న
మీరంతా - నీంగ ఎల్లారూ
మన్నించాలి -మన్నికనుం
కొన్ని రోజులుగా- కొంచెం నాల్లా
టైం దొరకడం లేదు- టైం కడెక్కర్దిల్ల

లేదు- ఇల్లై
మరి ఎలా- అప్పొ ఎప్పిడీ

పోనీ వదిలెయ్- పోగటుం వుడు
మరొక్కసారి చూద్దాం- ఇన్నొరుదరం పాకలాం

నువ్వు ఎప్పుడూ ఇలాగే అంటావ్- నీ ఎప్పోమే ఇప్పిడిదా పేసువే
అంత కోపం ఎందుకు- అవళ కోపం(బం) ఎదుకు

కోపం ఏం లేదు- కోపం(బం) ఒన్ను ఇల్లై
నువ్వు చేసింది నాకు నచ్చలేదు- నీ పన్నినదు ఎనకు పుడికిలై

నాలుగు- నాలు
సంవత్సరాలుగా - వర్షమా
పోలీసులు వెతికి - పోలీస్ తేడి
రెండు రోజుల - రెండు నాల్
ముందే - మున్నాడిదా (ముందు- మున్నాడి)
అరెస్ట్ చేసారు- అరెస్ట్ పన్నా
ఇప్పుడు - ఇప్పో
జైల్ నుండి - జైల్ లేందు
తప్పించుకున్నాడే - తప్పిచ్చిటానే

ఇంత సెక్యూరిటీ - ఇవొళో సెక్యూరిటీ
ఉన్నా- ఇరుందూ
తప్పిచ్చుకు పోయాడు సర్-  తప్పిచ్చిపోయిటా సర్

మీరు - నీంగల్/నీంగ
ఏమి-ఎన్న
పని-వేల
చేస్తారు - పన్నువీంగే

నేను -నా

ఇంట్లోనే-వీట్లయే
ఉంటాను - ఇర్పేన్

అలా అయితే - అప్పిడీన్న

 మీకు - ఒంగలకు
బోర్ కాదా - బోర్ ఆగాదా

అవుతుందే- ఆగుమే
ఏం చేసేది- ఎన్న పండ్రదు

పనిమనిషి రాలేదు- వేలకారమ్మ వరలై
నేనే - నానే
అంతా చేసుకోవాలి- ఎల్లాం పన్నవేండుం


అవన్ - వాడు
ఇప్పొ-ఇప్పుడు
ఇండియా వందుర్కా -ఇండియా వచ్చాడు
ఒంగ ఊపు- మీ ఊరు
తలైవన- నాయకున్ని
తేడి-వెతికి
పుడింగ-పట్టుకోండి

మాకు - ఎంగల్కు
స్కూలు-పల్లిగూడం
లేదు- ఇల్లై

మీకు-ఒంగళ్కు
పని- వేళ
అయిందా- ఆయిడ్తా


నిన్న - నేతికి
నేను - నాన్ / నా
మీతో - ఒంగళోడ
వచ్చాను - వందేన్

ఈ రోజు -ఇన్నికి
నువ్వు - నీ
నాతో - ఎంకూడ (ఎన్న కూడ)
వస్తావా - వరియా

రేపు - నాళకి
నేను - నాన్ / నా
మీతో - ఒంగళోడ
రావాలి - వరనుం


ఆ రోజు నుండి - అన్నికి లేందు
మీరంతా - నీంగెల్లా
ఏం చేసారు - ఎన్న పన్నేళ్

నేను వేలైల సేందిరికేన్ - నేను ఉద్యోగంలో చేరాను
ఇక నుండి - ఇన్నుమేల్
నాకు సమయం - ఎనకు నేరమ్
తక్కువగా - కమ్మియా
ఉండవచ్చు - ఇరుకలాం


ఇన్నికి ఎన్న సమయల్- ఈ రోజు వంట ఏమిటి
ఇన్నుం- ఇంకా
ఒన్నుం - ఏమీ
యోచికలై - ఆలోచించలేదు
వత్త కొళంబు - అంటు పులుసు
పన్నాళాంని  -  చేయాలని 
ననచిండ్రికేన్-అనుకుంటున్నాను


ఈ రోజు - ఇన్నికి
 నేను - ?
చాలా - ?
సంతోషంగా ఉన్నాను - సంతోషమా ఇరికేన్/ఇర్కే/ఇర్కేన్

ఎందుకని- ఎదుక్కాగ
అడగండి- కేలుంగో


తినాలి - సాపడ్నుం
తింటాను - సాపడ్రే/సాపడ్రేన్
తిన్నావా - సాప్టియా
తిన్నారా - సాప్టీంగ్లా
తినలేదు - సాపడ్లై
తింటున్నాను - సాప్టిండ్రికేన్


Done ముందు- మున్నాడి
వెనుక-పిన్నాడి
దగ్గర - పక్కతిల
క్రింద -కీళ
పైన-మేళ
తర్వాత-అప్పరం
లోపల-ఉళ్ళ
బయట-వెళ్ళీల Done

అందులో-అదుల
ఇందులో-ఇదుల
కానీ- ఆనా
అందుకోసం-అదుక్కాగ
ఇందుకోసం-ఇదుక్కాగ Done

లీల పాడుతుంది- లీల పాడువా (will sing)
రాజు నవ్వుతాడు- రాజు సిరిప్పా

లీల పాడింది - లీల పాడిటా (sang)
రాజు నవ్వాడు - రాజు సిరిచ్చా

లీల పాడుతూ ఉంది - లీల పాడిండ్రికా (is singing)

రాజు నవ్వుతూ ఉన్నాడు - రాజు సిరిచిండ్రికా


రాజు మంచి పుస్తకం చదువుతున్నాడు
రాజు నల్ల పుస్తకం పడికిరా

రాజు మంచి పుస్తకం చదువుతాడు

రాజు నల్ల పుస్తకం పడిప్పా



రాజు మంచి పుస్తకం చదివాడు

రాజు నల్ల పుస్తకం పడిచిటా



రాజు మంచి పుస్తకం చదవాలి


రాజు నల్ల పుస్తకం పడిక్కనుం

ఏంటబ్బా విశేషాలు- ఎన్నప్పా విశేష
షాపింగ్ కు-షాంపింగ్ కు
పోదాం-పోలాం
వస్తారా -  (  ?  )

మీకు వేరే పనేం లేదా- ఒంగళ్కు వేరే (  ?  ) ఇల్లియా

ఎప్పుడు చూడు షాపింగ్ అంటారు- ఎప్పొ పారు షాపింగురీంగే


సంక్రాంతి- పొంగల్
వస్తోంది- వరుదు


నిన్న - నేతికి
శబరిమలలో- శబరిమల
జరిగిన- నడంద
సంఘటన-సంభవం
నాకు- ఎనకు

నచ్చలేదు - పుడికిలై

కొత్త సంవత్సరం- పుత్తాండు
శుభాకాంక్షలు-నళ్ వాళ్తుగళ్
అందరూ- ఎల్లారూ
ఏమి-ఎన్న
చేస్తున్నారు- పండ్రేల్

పబ్లిక్ గార్డెన్ వరకు- పబ్లిక్ గార్డెన్ వరగు
పోతాను/వెళ్తాను- పోవేన్
నేను-నా
ఇంట్లోనే- వీటులయే/వీట్లయే

ఉంటాను-ఇరుపేన్


బడికి-పల్లిగూడత్తుకు
ఎన్ని గంటలకు-ఎత్తన మనికి
పోవాలి-పోనుం
ఒంటి గంటకు- ఒరు మనికి
రెండు గంటలకు- రెండు మనికి
మూడు-మూను
నాలుగు-నాలుగ్
ఐదు-అంజు
ఆరు-ఆరు
ఏడు-ఏళు
ఎనిమిది-ఎంటు
తొమ్మిది-ఒంబదు
పది-పత్తు


మీరు-?
రోజూ-దినా
ఉదయం-కాలైల
నడుస్తారా- నడుపీంగ్లా

పోయిన సంవత్సరం - పోన వర్షం
మీరు- నీంగ
ఎక్కడ- ఎంగె
(కలిపి చెప్పినపుడు) మీరెక్కడ-నీంగెంగె
ఉన్నారు- ఇరుందేల్
(కలిపి చెప్పినపుడు) ఎక్కడున్నారు- ఎంగిరిందేల్

నేను-నా
వరంగల్ కు - వరంగల్ కు
పోతాను-పోరోన్
మీరు-నీంగ
నువ్వు-నీ
వస్తారా-వరీంగ్లా
వస్తావా-వరియా

ఎవరెవరు - యారుయారు
వెళ్తున్నారు-పోరీంగే
నేను, నా కూతురు-నా, ఎంపొన్ను
నేను, నా కొడుకు-నా, ఎంపయ్యన్
నా భర్తతో- ఎంగాతుకారోడ
సరే- సరి

వెళ్ళిరండి- పోయిటు వాంగో

మీరే- నీంగలే
రోజూ- దినమూ
రెండు-రెండు
పదాలు-వార్తెగల్
ఇవ్వండి-కుడుంగో

నలుపు - కరుప్పు
ఎరుపు- సెగప్పు

ఈరోజు-ఇన్నికి
ఏమి - ఎన్న
చేయబోతున్నావు - పన్నపోరే
చేయబోతున్నారు-పన్నపోరేల్
చేస్తావు-పన్నువే
చేస్తారు-పన్నువేల్
ఈరోజు-ఇన్నికి
సినిమా -పడం
పాట-పాటు
పెళ్ళికి-కళ్యాణతుకు
చూడాలి-పాకనుం
పోవాలి-పోగనుం
పాడాలి-పాడనుం
ఏమీ చేయను-ఒన్నుం పన్నమాటే
అల్లుడు వస్తాడు- మాపులె వరువాన్
కూతురు వస్తుంది- పొన్ను వరువా
వంట చేయాలి- సమయల్ పన్ననుం
టీవీ చూడాలి-టీవీ పాకనుం

వాడు - అవను
ఇంకా - ఇన్నుం
రాలేదు - వరలై
ఏం జరిగిందో ఏమో- ఎన్నాచో ఎన్నవో


అనుకున్నదే - ననచదే
జరిగింది - నడందది

మాకు - ఎంగళకు
పది - పత్తు
రోజుల నుండి - నాల్లా
ఎండ - వెయ్యిల్

లేదు - ఇల్లై

రా - వా
ఆడు - ఆడు
దిగు - ఎరంగు
కిందకు దిగు - కీల ఎరంగు
చంపు - కొన్నుడు
చెయ్యి (do) - పన్ను


పాడు - పాడు 
ఒక పాట పాడు - ఒరు పాటు పాడు
నాకు పాట రాదు - ఎనక్కు పాటు వరాదు
మీరే పాడండి - నీంగలే పాడుంగో


పో - పో
పోండి - పోంగో
బయటకు పో - వెల్లీల పో
పోయి రా - పోయిటు వా

పోతాను - పోరేన్ 
పోయాను - పోయిటేన్
పోతున్నాను - పోయిండ్రికేన్
Tenses in Tamil

వస్తాను-వరేన్, వచ్చాను- వందుటేన్, వస్తున్నాను-వందుండ్రికేన్, వస్తున్నారు-వందుండ్రుకాంగ, వస్తున్నాడు- వంద్రుండ్రుకాన్, వస్తుంది- వరువా

అమ్మ వచ్చిందా - అమ్మ వందుటాంగ్లా
వస్తున్నారు- వందుండ్రుకాంగ
గురువులు ఎక్కడి దాకా వచ్చారు - గురు అవరు ఎంగెవరకు వందుటాంగ


రావాలనే ఉంది - వరనుందా ఇరుకు
ఏమీ అర్థం కావడం లేదు - ఒన్నుం పురియమాటేంగర్దు
ఎన్ని కావాలి - ఎవళ వేణుం
రెండు చాలు - రెండు పోరుం

మీకు 
ఏమి 
కావాలి



ఏమి జరుగుతోంది - ఎన్న నడకరుదు, ఎన్న నడకర్దు
ఏమి జరిగింది - ఎన్న ఆచి , ఎన్నాచి
ఏమి జరగబోతోంది- ఎన్న నడకపోరదు, ఎన్న నడకపోర్దు
ఏమి జరగాలి- ఎన్న నడకనుం
ఏమైనా జరిగిందా- ఎదావదు ఆచా


మీరు - 
ఎవరు - 
మీ -
పేరు - 

ఏమిటి -


ఘాటి సుబ్రమణ్య గుడి ఎక్కడ ఉంది - 
ఘాటి సుబ్రమణ్య కోవిల్ ఎంగిరుక్కు 
ఘాటి సుబ్రమణ్య గుడి దొడ్డబల్లాపూర్ లో ఉంది -
ఘాటి సుబ్రమణ్య కోవిల్ దొడ్డబల్లాపూర్ ల ఇరుక్కు
మీరు వెళ్తారా ?- నీంగ పోవీంగ్లా?
అవును, వెళ్ళాలి- ఆమా, పోనుం


ఎక్కడి నుండి - ఎంగేందు
వస్తున్నారు- వరీంగె
పొన్ను వీటుకు- బిడ్డ ఇంటికి
పోయినాను-పోయిటేన్


చేయాలి - పన్ననుం
చేస్తాను- పండ్రేన్
చేస్తావా- పండ్రియా
చేద్దాం- పన్నలాం
చేస్తారా - పండ్రీంగ్లా
చేయవద్దు - పన్నవేండాం

ఈ రోజు - ఇన్నికి
గణేశ పండుగ - పుల్లెయార్ పండిగె
చాలా పని ఉంది - నరియా వేళ ఇరుకు
గణేశ సహస్ర నామాలు, గణేశ అష్టోత్తరాలు - గణేశ సహస్ర నామంగళ్, గణేశ అష్టోత్తరంగళ్
నైవేద్యం చేయాలి- నైవేద్యం పన్ననుం


రేపు-నాళకి
ఏమి-ఎన్న
వంట-సమయల్
చేద్దాం-పన్నలాం


ఎవరో-యారో
వచ్చారు-వందుర్కా
చూడు-పారు
ఎవరో-యారో
తెలియదు-తెరియాదు

మీరు ఎవరు-నీంగ యారు


మీకు కొరియర్ వచ్చింది - ఒంగళుకు కొరియర్ వందుర్కు

హౌదా? కుడి – అప్పిడియా? కుడుంగో
ఎవరు పంపారు? - యారు అనపిరికా?
రేపు పండుగ - నాలెకి పండిగే

చాలా పని ఉంది - నరియా వేళ ఇరుకు

కూరగాయల  దుకాణానికి పోయిరావాలి - కాయగిరి కడైకి పోయిటు వరణుం, అన్నీ ఖాళీ అయిపోయాయి - ఎల్లామే  గాలీ  ఆయిడ్తుతిరుపతికి బస్సులో వెళ్తారా - తిరుపతికి బస్సుల పోరేలాఅవును  - ఆమామీరు ఎలా వెళ్తారు - నీంగ ఎప్పిడీ పోరేల్మేము కారులో- నాంగ కార్ల
మరల - తిరిపి

తల్లి- అమ్మ, తాయి

ఇక్కడ - ఇంగె

అక్కడ- అంగె

ఎక్కడ- ఎంగె

దూరంగా - దూరమా

దగ్గరగా - పక్కదల్లి

ఎవరు-యారు

కొత్త-పుదుసు

పాత - పళసు

కొత్తది-పుదుసుదు


పాతది-పళసుదు


హలో ఓలా బుక్ చేసాము – హలో ఓలా బుక్ పన్నిటం
సరే సర్ వస్తున్నాను – సరి సర్, వందుండ్రుకేన్
అడ్రస్ ఎక్కడ వస్తుంది – అడ్రస్ ఎంగ వరుం
ఎక్కడికి రావాలి – ఎంగె పోనుం
గుడి పక్కన– కోవిల్ పక్కతిల
రామాలయం వెనుక  - రామర్ కోవిల్ పిన్నాడి
ఇంటికి రావాలి - వీటుకు వరనుం
డ్రాప్ ఎక్కడ – డ్రాప్ ఎంగె
యశ్వంతపుర రైల్వేస్టేషన్ - యశ్వంతపుర రైల్వేస్టేషన్
ఇక్కడ ఆపు – ఇంగ నిప్పాటుంగో
బిల్ ఎంత అయింది – బిల్లు ఎవళ ఆచి
యాభై రూపాయలు – అంబదు రూవా

తీసుకోండి – ఎడ్తుకోంగో

మాకు - 
ఈ సంవత్సరం - ఇంద వర్షం 
బతుకమ్మకు ఇబ్బందే లేదు- బతుకమ్మకు తొందరయే ?
అందరూ రండి - ఎల్లారూ ?

నమస్తే - వనక్కం
బాగున్నారా? - సౌఖ్యమా, నన్నార్కీంగ్లా (నన్నా ఇర్కీం గ్లా)
బాగున్నాను - సౌఖ్యం, నన్నా ఇరికేన్
మీరు - నీంగ, నీంగళ్
రండి - వాంగో

మీ - ఒంగ, ఒంగళ్
నీ - ఒం. ఒన్నోడ, ఒన్
పేరు - పేరు
ఏమిటి - ఎన్న
నా - ఎన్

(ఒంగ పేరు ఎన్న) కలిపి మాట్లాడేటపుడు    ఒంగ పేరెన్న - (In telugu)
నా - ఎన్
(Now you can tell me నా పేరు .....)

నాది - ఎందు, ఎన్నోడది
మీది - ఒంగళ్దు
మనది - నంబల్దు
వాడిది - అవనోడదు
ఆమెది - అవలోడదు

మీ పేరు ఏమిటి - ఒంగ పేరు ఎన్న, ఒంగ పేరెన్న
నా పేరు రేవతి- ఎం పేరు రేవతి, ఎన్నోడ పేరు రేవతి
ఒంగ పేరెన్న?
ఎం పేరు ........


(Practice)
నమస్తే - ?
బాగున్నారా - ?
మీ పేరు ఏమిటి - ?
నీ పేరు ఏమిటి - ?
నా పేరు - ?
మీ ఊరు పేరు ఏమిటి - ?


కావాలి - వేణుం
వద్దు - వేండ, వేండాం
కావాలా? - వేణుమా?
వద్దా? - వేండామా?
నాకు - ఎనక్కు
నీకు - ఒనక్కు
మీకు - ఒంగళ్కు

పని - వేల
చేస్తారు - పన్నువేళ్
చేస్తాను - పన్నువేన్
మా- ఎంగ
ఊరు - ఊరు

ఈ రోజు - ఇన్నికి
నిన్న - నేతికి
రేపు - నాళకి 
ఏరోజు- ఎన్నికి
ఆరోజు - అన్నికి
మొన్న - ముందానాళ్
ఇప్పుడు- ఇప్పొ
అప్పుడు - అప్పొ
అప్పుడే- అప్పొవే
ఇప్పుడే- ఇప్పొవే
ఈ నిమిషం- ఇంద నిమిషం
ఈ నిమిషమే - ఇంద నిమిషమే

ఇది మీదా?- ఇది ఒంగళ్దా?
అవును - ఆమా
కాదు - ఇల్లై
అది నాది - అది ఎన్నోడది
అలాగా? - అప్పిడియా

గోరు చిక్కుడు కాయ - కొత్తవరంగా
బంగాళా దుంప (ఆలు గడ్డ) - ఉర్లకళంగు
కాకరకాయ-పావకా
కొత్తిమీర- కొత్తమల్లి
కరివేపాకు - కరివేపుల
మునగకాయ-మురుంగక్కా
ఉల్లి గడ్డ - వెంగాయం
పచ్చిమిర్చి - పచ్చమలగా
వంకాయ - కత్తిరికా
బెండకాయ-బెండక్కా
చిక్కుడు కాయ-అవరిక్కా


నేను ఈ రోజు బిజీగా ఉన్నాను - నాను ఇన్నికి బిజియా ఇరికేన్,, దయచేసి పాత పాఠాలు రివైజ్ చేయండి - దైవసెంజి పళయ పాటంగల్ రివైజ్ పన్నుంగో 


నువ్వు-నీ

మీరు - నీంగళ్

మనం-నమ్మ

వారు-అవంగ

వీరు-ఇవంగ


ఎవరు-యారు

టీ తీసుకోండి - టీ ఎడ్తుకోంగో, టీ తీసుకో - టీ ఎడ్తుకో, నీళ్ళు తాగండి - జలం కుడింగో, నీళ్ళు తాగు - జలం కుడి, మీరు వెళ్ళండి - నీంగ పోంగో, నువ్వు వెళ్ళు- నీ పో
ఇక్కడ ఇపుడు భజన ఉందా - ఇంగె ఇప్పో భజన ఇరుక్కా
ఇక్కడ పక్కన ఏదైనా గుడి ఉందా -ఇంగె పక్కతిల ఎదావదు కోవిల్ ఇరుక్కా
ఈ రోజు టీవీలో ఏ ప్రోగ్రాం ఉంది - ఇన్నికి టీవీల ఎన్న ప్రోగ్రాం ఇరుక్కు
నేను మధ్యలో ఎక్కడైనా కూర్చోవాలి - నా నడువుల ఎంగాదు ఒక్కారనుం
నేను ముందుర కూర్చోవాలి - నా మున్నాడి ఒక్కారనుం

ప్లీజ్ – దైవసెంజి
నాకు ఇది కావాలి  - ఎనకిది వేనుం
నిదానంగా వాహనం నడుపు – నిదానమా గాడి ఓటు
ఇది బాగుంది – ఇది నన్నార్కు
నేను మళ్ళీ వస్తాను - నా తిరిపి వరేన్
క్షమించు-- మన్నిచ్చుకో
నాకు ఇది వద్దు –ఇది ఎనకు వేండ
రేపు రా - నాళకి వా
నిన్న రాలేదా– నెతికి వరలియా
పని అయిందా – వేళ ఆయిడ్తా
చేస్తూ ఉన్నాను – పన్నిండే ఇర్కేన్


క్షమించాలి – మన్నికనుం                                   పోవాలి – పోనుం
చేయాలి – పన్ననుం                                       చూడాలి – పాకనుం
ఇవ్వాలి – కుడుకనుం                                          అడగాలి – కేకనుం
పరిగెత్తాలి – ఓడనుం                                        తేవాలి - ఎడ్తున్ వరనుం

మాట్లాడాలి – పేసనుం                                నిద్రపోవాలి – తూంగనుం

No comments:

Post a Comment